Header Banner

ప్రధాని సభకు జగన్‌కు ప్రత్యేక ఆహ్వానం! ఈ కార్యక్రమానికి హాజరు అవుతారా?

  Thu May 01, 2025 10:34        Politics

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు అధికార కూటమి ఆహ్వానం – ప్రధాని మోదీ సభకు హాజరయ్యేనా? ఏపీలో రాజకీయ ఉత్సాహాన్ని రెట్టింపు చేసే పరిణామం ఇది. మే 2న అమరావతిలో జరగబోయే పునర్నిర్మాణ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అధికార ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఆహ్వానం పంపింది. అమరావతిని ప్రజల కలల రాజధానిగా మళ్లీ తీర్చిదిద్దేందుకు కేంద్రం, రాష్ట్రం కలసి చేపట్టిన రీ-లాంచ్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌కు కూడా ఆహ్వానం పంపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తాడేపల్లిలోని జగన్ నివాసానికి ప్రోటోకాల్ అధికారులు ఆహ్వాన పత్రికను వ్యక్తిగతంగా అందించేందుకు ప్రభుత్వ అసిస్టెంట్ ప్రోటోకాల్ అధికారి ఫజల్ స్వయంగా బుధవారం సాయంత్రం తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లారు. అయితే జగన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వ్యక్తిగత కార్యదర్శి కె. నాగేశ్వర రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు. ప్రోటోకాల్ అధికారులు జగన్ అపాయింట్మెంట్ కోరినప్పటికీ, ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల పీఏకి ఇచ్చినట్లు నిర్ధారించారు.


ఇది కూడా చదవండి: ఏపీకి రూ.172 కోట్లతో మరో కొత్త మాల్! ఆ నగరంలో ఫిక్స్..!


జగన్ హాజరు అవుతారా?
ఆహ్వానం పంపిన తర్వాత, ప్రధాన ప్రశ్న – జగన్ ఈ కార్యక్రమానికి హాజరు అవుతారా?.. రాజధాని అమరావతిపై గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న వైఖరి, మూడు రాజధానుల భావన నేపథ్యంలో, ఈ ఆహ్వానం ఆయనకు విధేయతా పరీక్షలా మారనుందన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ. అధికార పక్షం విభేదాలను పక్కన పెట్టి మాజీ సీఎం స్థాయికి గౌరవం ఇస్తూ ఆహ్వానం పంపడం గమనార్హం.
రాజకీయ శత్రుత్వం కంటే ప్రజల ప్రయోజనాలకే ప్రధానం అన్న సంకేతమా?
ఈ ఆహ్వానం ద్వారా కేంద్రం, రాష్ట్రం వైఎస్ జగన్‌ను కూడా ప్రాజెక్టులో భాగం చేయాలని భావించడం, “అమరావతి అన్నది కేవలం ఓ పార్టీది కాదు, తెలుగు ప్రజల కల” అన్న సంకేతాన్ని ఇస్తోంది. ఇక మే 2న జరిగే సభలో జగన్ హాజరైతే, అది ఏపీలో రాజకీయ ఆధిపత్య ధోరణిని కొంతమేర తగ్గించే అవకాశముంటుంది. లేకపోతే, మరోసారి వైసీపీ ఆలోచనా విధానం వేరన్న సంకేతాన్ని ఇస్తుందన్న చర్చలకు తావుంటుందని విశ్లేషణలు ప్రారంభం అయ్యాయి.

ఇది కూడా చదవండి: ప్లాట్ కొనుగోలుదారులకు భారీ ఊరట..! రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గించిన ఏపీ ప్రభుత్వం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #Jagan #PMModi #AmaravatiEvent #APPolitics #SpecialInvite #YSJagan #PoliticalBuzz #ModiJaganMeet